పెడనలోని భారత్ గ్యాస్ కంపెనీ సమీపంలో ఉన్న రామరాజు కెనాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శనివారం కాలువలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్రప్రసాద్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.