వినాయకుడి నిమజ్జనానికి వచ్చి గుంతలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మంగపేటలో జరిగింది. స్థానికుల వివరాలు.. వాజేడుకు చెందిన అంజన్న బ్రాహ్మణపల్లి వద్ద ఏర్పాటుచేసిన వినాయక నిమజ్జనం శోభయాత్రకి వచ్చాడు. నిమజ్జనం అనంతరం ఇంటికి వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన గుంతలో పడి మృతి చెందాడన్నారు. శనివారం సాయంత్రం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.