కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని చెన్నూరు మండలం చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక నిమజ్జనం జరిగే ఇర్కాన్ సర్కిల్, శేషయ్య గారి పల్లి వద్ద ఉన్న కె.సి కెనాల్ బ్రిడ్జి, చెన్నూరు పెన్నా నది కొత్త బ్రిడ్జి,కొండపేట వంతెన,పాత కడప చెరువుల వద్ద బుధవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కడప డిఎస్పీ వెంకటేశ్వర్లు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గణేష్ నిమజ్జనం సంధర్బంగా వినాయక విగ్రహాలను ఎత్తే భారీ క్రేన్లను దానికి సంబందించిన డ్రైవర్లను సిద్దంగా ఉంచుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.