పర్యావరణహితంగా ప్రజలందరు వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని తెలిపిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పర్యావరణానికి హాని చేయని విధంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక చవితి పండుగ సందర్భంగా వాసు దేవ ఫ్రెండ్ సర్కిల్ సౌజన్యంతో మంత్రి మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం రామానాయుడుపేటలోని వాసుదేవ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ వద్ద నగర ప్రజలకు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.