నల్లగొండ జిల్లా: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులు అన్ని రకాలుగా తీర్చిదిద్దాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం సూచించారు. ఈ సందర్భంగా గుర్రంపోడు కేజీబీవీని అకస్మికంగా తనిఖీ చేసి వంటగదిని డైనింగ్ పరిసరాలను వాష్ ఏరియా పరిశుభ్రతను పరిశీలించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగుల సంఖ్య ఏఎంసీ ప్రసవాలు సీజనల్ వ్యాధులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.