రాజంపేట ఎంపీ వెంకట మిథున్ రెడ్డిని పీలేరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి శ్రేణులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.కూటమి ప్రభుత్వం పెట్టిన లిక్కర్ అక్రమ కేసులో జైలు శిక్ష అనుభవించి తాత్కాలిక బెయిల్ పై ఈనెల 12 వరకు విడుదలైన రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన ఇంటి వద్ద ఏపి ఎండీసి మాజీ డైరెక్టర్ హరీష్ రెడ్డి మరియు పీలేరు సర్పంచ్ షేక్ హబీబ్ భాషా మరియు వైసీపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వెంకట మిథున్ రెడ్డి మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గం లో వైకాపా బలోపేతం పై దృష్టి సారించాలని సూచించారు