గుత్తిలో బుధవారం వర్షం దంచి కొట్టింది. భారీ వర్షం కారణంగా అంబేద్కర్ కూరగాయల మార్కెట్లోకి వర్షం నీరు చేరింది. దీంతో వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాయల్ సర్కిల్ వద్ద డ్రైనేజీ కాలువ పొంగిపొర్లుతున్నది. మురుగు నీరు అంతా రోడ్లపై ప్రవహిస్తున్నది. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.