ఆళ్లగడ్డలో లింగమయ్య వీధిలో విద్య వినాయక కమిటీ ఆధ్వర్యంలో మండపం వద్ద బుధవారం ఆలయ అర్చకుడు ప్రతాప్ శర్మ పూజలు చేశారు. పట్టణంలో దాదాపు 72 వినాయక విగ్రహాలు ఇప్పటివరకు ఆన్లైన్లో అనుమతి పొందారని టౌన్ పోలీసులు తెలిపారు. వర్ష సూచనతో మండపాల వద్ద షార్ట్ సర్క్యూట్ కాకుండా మండప నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ ఏఈ కృష్ణయ్య సూచించారు.