జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.బచ్చన్నపేట మండలం అలీంపూర్ సమీపంలో ఆగి ఉన్న లారీని చేప పిల్లల లోడుతో వెళ్తున అశోక్ లే ల్యాండ్ వాహనం మంగళవారం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో చెప్ప పిల్లల వాహనంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైంది.వాహనంలో ఇరుకున్న ముగ్గురిని స్థానికులు కాపాడడంతో గాయలత బయటపడ్డారు.గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.