ఈరోజు రాజోలి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గల ఆటో యూనియన్ కార్యాలయం ముందు మాజీ సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ పార్లమెంట్ సభ్యులు కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి ప్రథమ వర్ధంతి జరిగింది. కెవిపిఎస్ మండల కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు ఎంతో కష్టపడి పోరాటం చేసిన మహాయోధుడని దేశ ప్రజల తరఫున పార్లమెంటులో గలం విప్పి మాట్లాడిన నిప్పు కనికమని అన్నారు. ఆ మహానేత రాష్ట్రం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ కార్యదర్శిగా ఎన్నికైనటువంటి మహా వ్యక్తి అని అన్నారు.