మధురవాడ చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిలో సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు దాటు తుండగా లారీ ఢీకొనడం వల్ల అక్కడికక్కడే మృతి చెందినాడు. మృత దేహం లారీ కింద నలిగిపోయి గుర్తుపట్టని విధంగా నుజ్జు నుజ్జు అయ్యిపోయింది. మృతుడిని గుర్తించనివారు తక్షణమే పీఎంపాలెం సిఐ బాలకృష్ణకి మరియు పీఎంపాలెం పోలీసులకి తెలియజేయవలసిందిగా కోరుతున్నారు.