అవనిగడ్డ లో క్యూఆర్ కోడ్ సహిత స్మార్ట్ కార్డులతో రేషన్ పంపిణీ సులభతరం అవుతుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం అవనిగడ్డ మూడవ వార్డులో గుర్రపు చెరువు దగ్గర రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డుదారులకు నూతన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 1. 45 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రైస్ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు.