2014లో కాంగ్రెస్ ప్రభుత్వం 17వేల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగిస్తే కెసిఆర్ ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పుచేసి తెలంగాణ కు తీరని అన్యాయం చేసిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి విమర్శించారు. గురువారం నారాయణఖేడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇసుక బజారును ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వంలో ఇండ్ల నిర్మాణాలను చేపట్టలేదని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ ఇందిరమ్మ పథకంలో ఇండ్లను నిర్మించేందుకు సహకరిస్తుందని తెలిపారు.