మాస వారి తనిఖీలలో భాగంగా గురువారం సాయంత్రం జిల్లాలోని ఫిరంగిపురం మండలం, రేపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు భద్ర పరిచిన వీవీ ప్యాడ్స్ గోడౌన్ ను జిల్లా రెవిన్యూ డివిజినల్ అధికారి కె. శ్రీనివాస రావు తనిఖీ చేశారు. మార్కెట్ యార్డ్ నందు భద్రపరచిన వీవీ ప్యాడ్స్ గోడౌన్ నందు గల భద్రతా ప్రమాణాలను పరిశీలించి అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిరంగిపురం తహసిల్దార్ శ్రీ. జె. ప్రసాద రావు పలువురు అధికారులు పాల్గొన్నారు.