మీ భార్య అయితే ఒక న్యాయం హరికృష్ణ భార్య అయితే మరో న్యాయమా అంటూ కూటమి ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించి ధ్వజమెత్తారు. ఇదంతా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు.