గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన! రేణిగుంట: వినాయక నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా జరిగేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. శుక్రవారం రేణిగుంట సీఆర్ఎస్ చక్రాలగుంట వద్ద ఎంపీడీవో ప్రభువు రావు, సీఐ జయచంద్ర, పంచాయతీ సెక్రటరీ మాధవి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు బాషా కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా చర్యల కోసం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ట్రాఫిక్ నియంత్రణలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.