ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వాదంపల్లి గ్రామానికి చెందిన మనోహర్ ఇటీవల విడుదలైన డీఎస్సీ పరీక్షల ఫలితాలలో సత్తా చాట్టాడు. ఏకంగా 84% మార్కులతో మనోహర్ ఉత్తీర్ణత సాధించి అందరిని ఆకర్షించాడు. గతంలో తెలంగాణలో కూడా రాసిన పరీక్షలలో 74 శాతానికి పైగా మార్కులు సాధించినట్లుగా ఆదివారం కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగం సాధించిన మనోహర్ ను పలువురు అభినందిస్తూ అభినందనలు తెలిపారు.