ఖానాపూర్ మండలంలో నెలకోన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బిజెపి నాయకులు ఖానాపూర్ తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి తాసిల్దార్ సుజాత రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సధర్మాట్ బ్యారేజ్ నుండి ప్రత్యేక కెనాల్ ఏర్పాటు చేసి కాల్వకు రెండు వైపులా ఉన్న తూములకు మరమ్మత్తులు చేయించాలన్నారు. అవసరం ఉన్నచోట కొత్త తూముల నిర్మించి రైతులకు సాగునీటి సమస్యలు లేకుండా చూడాలని కోరారు. అలాగే ఖానాపూర్ రోడ్డు వైన్డింగ్ పనులను ప్రారంభించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని కోరారు.