వరద పోటెత్తడంతో లంక గ్రామాల్లో పశువులకు పశుగ్రాసం దొరకని పరిస్థితి ఏర్పడింది. అయినవిల్లి మండలం లో లంకల నుండి పశువులను ఏటిగట్లపై కట్టేసి కాపాడుకుంటున్నారు. అయితే మేత కోసం అల్లాడిపోతున్న పశువులను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. పశుగ్రాసం, దాణా అందించి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.