తిరుపతి జిల్లా వెంకటగిరి మరియ గూడూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్స్ ను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. లేడీ డాన్ అరుణ, శ్రీకాంత్ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్న కొంతమందిని అరెస్ట్ చేసి మరికొంత మందిని బైండోవర్ చేశామన్నారు. ఆయన వెంట డీఎస్పీ గీతా కుమారి పోలీసు సిబ్బంది ఉన్నారు.