కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ చౌరస్తా వద్ద లక్షల రూపాయలతో నిర్మించిన మరుగుదొడ్లు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే మరుగుదొడ్లు పనిచేయడం లేదని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టీకానంద్, కార్తీకులు ఆరోపించారు. మరుగుదొడ్ల వద్ద నీటి సౌకర్యం లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయని అన్నారు,