ముత్తుకూరు మండలం నేలటూరులో ఉన్న జెన్కో పరిశ్రమలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తోటపల్లి గూడూరు మండల అధ్యక్షుడు సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. తాము యాజమాన్యానికి సహకరిస్తుంటే ఇంత నిర్లక్ష్యమా అంటూ ప్రశ్నించారు. నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు.. పలు డిమాండ్లను పరిష్కరించాలని గురువారం సాయంత్రం 6 గంటలకు డిమాండ్ చేశారు