ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెద్ద బోయిల్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి భార్యతో ఏర్పడిన మనస్పర్దాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునేందుకు నాగూర్ కర్నూలు జిల్లాకు తన ముగ్గురు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్ళాడు. మోక్షిత, రఘు వర్షిని, కుమారుడు శివ ధర్మను పెట్రోల్ పోసి వెంకటేశ్వర్లు చంపాడు. తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఈనెల 4వ తేదీన వెలుగు చూసింది. అయితే చిన్నారులు జీవించి ఉన్న సమయంలో సరదాగా ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.