ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాల నేపథ్యంలో అయినవిల్లి మండలం పరిధిలోని పలు లంక గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఈ నేపథ్యంలో బుధవారం స్థానికంగా ఉన్న ఒక రైతు మాట్లాడుతూ.. గోదావరి వరదకు రెండుసార్లు అరటి తోటలు మొత్తం నీటముననిగాయన్నారు. పంట మొత్తం నాశనం అయిపోయిందని, అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని కోరారు.