రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో గ్రామపంచాయతీల వార్డుల వారీగా ఓటర్ జాబితాలను పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించినట్లు ఎంపీడీవో మహేందర్ రెడ్డి తెలిపారు. ఓటర్లు ఓటర్ లిస్టులో తమ పేర్లను సరిచూసుకొని ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 వరకు పంచాయతీ కార్యదర్శులకు తెలపాలన్నారు. సెప్టెంబర్ రెండవ తేదీన ఓటర్ లిస్ట్ ఫైనల్ జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు.