నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని పాండురంగ స్వామి గుడి దగ్గర ఉన్న కోనేరులో మంగళవారం గంబూసియా చేపలను నంద్యాల జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖర్ రావు వదిలారు. ఈ చేపలు మలేరియా, డెంగ్యూ కలిగించే దోమల లార్వాలను నిర్మూలిస్తామని ఆయన తెలిపారు. గ్రామంలో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ విశ్వనాథ్, హెల్త్ సూపర్వైజర్లు ముని స్వామి, పరమేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.