వివేకానంద నగర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ ఎన్ వంశి రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బిహారి ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ తల్లి పై రాహుల్ గాంధీ చేసిన అసభ్య వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి నరేష్ మాట్లాడుతూ రాహుల్ వెంటనే ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.