కోడేరు మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు మోడల్ పాఠశాల అండ్ కళాశాల ప్రిన్సిపల్ రాఘవేందర్ శనివారం తెలిపారు. ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మిగులు సీట్లను భర్తీ చేసేందుకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అడ్మిషన్లు పొందేందుకు 9885765688 నంబర్ కు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.