అక్టోబర్ నెల 6,7 తేదీలలో జరగబోయే శ్రీ శ్రీ పైడితల్లి అమ్మ వారి ఉత్సవాలు భక్తుల్లో మధురానుభూతిని కలిగించేలా నిర్వహించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆహ్లాదకర వాతావరణం లో వేడుకలు జరగాలని, గత ఏడాది కంటే గొప్పగా నిర్వహించాలని తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో మంత్రి జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తో కలసి పైడి తల్లి అమ్మవారి ఉత్సవాల పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది అధికారులు, పోలీస్ లు , ప్రజల సహకారం తో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకున్నామని, ఈ ఏడాది అంతకన్నా గొప్పగా నిర్వహించాలని తెలిపారు.