శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో మంజూరైన 72,338 ఇళ్లలో ఇప్పటివరకు 28,240 పూర్తి కాగా, మిగిలిన 40,009 ఇళ్లలో 36,620 నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. పనుల పురోగతిని మరింత వేగవంతం చేయాలని సూచించారు.