కర్నూలులో గణేష్ నిమజ్జనం కోసం విద్యుత్ శాఖ సర్వం సిద్ధం కర్నూలు నగరంలో జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు విద్యుత్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. శోభాయాత్రలో ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేందుకు సుమారు 200 మంది విద్యుత్ సిబ్బందిని డ్యూటీకి నియమించారు.ఈ క్రమంలో నగరంలో దాదాపు రూ.1.25 కోట్లు ఖర్చుతో నూతనంగా నాలుగు టవర్లు, 110–11 మీటర్ల ఎత్తైన విద్యుత్ స్తంభాలు, 106–9.1 మీటర్ల ఎత్తైన స్తంభాలు ఏర్పాటు చేశారు.మంగళవారం స్థానిక పౌరస్ కాంపౌండ్‌లో జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎం.ఉమాపతి, టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.శేషాద్రి ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా