నిన్న కురిసిన భారీ వర్షానికి వర్ని మండలంలో వందల ఎకరాల్లో వరి పంట మక్కా నీట మునిగింది. మండలంలోని పాత వర్ని నెహ్రూ నగర్ వాగు పొంగిపోర్లడం రోడ్డుపై నుండి వరద ప్రవహించడంతో రోడ్డు పూర్తిగా కొట్టుకపోయింది. శుక్రవారం నెహ్రూ నగర్ హుమ్నాపూర్ వర్ని కి రావడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి వర్ని మండల వ్యాప్తంగా పంట నష్టము కూలిపోయిన ఇండ్ల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.