సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్ మాజీ సర్పంచ్ పట్లోళ్ల వీర్ శెట్టి మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన వీర్ శెట్టి కుటుంబానికి ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం శనివారం మధ్యాహ్నం వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచి, అండగా ఉంటామని మనో ధైర్యాన్ని కల్పించారు. వారితోపాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులున్నారు.