మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొట్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బయో డీజిల్ రవాణా చేస్తున్న ముఠాను శనివారం మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. నెల్లూరు నుంచి హైదరాబాద్కు తరలించి బౌరంపేట గ్రామంలోని బంగారు మైసమ్మ ఆలయం పక్కన విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 13 లక్షల 20వేల రూపాయల విలువైన 15000 లీటర్ల బయో డీజిల్ ను స్వాధీనం చేసుకున్నారు.