వార్డ్ నం.7 లో టెలీకాం శాఖ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్న Cell Tower నిర్మాణంపై స్థానికుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని, నివాసిత ప్రాంతాలలో ఆ నిర్మాణంను నిలుపదల చేయాలని కోరుతూ, ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఆ వార్డ్ ప్రజలు ఒక వినతి పత్రం అందజేశారు. జగిత్యాల పట్టణంలోని భాగ్యనగర్ (Ward No. 7)లోని నివాసిత ప్రాంతంలో Cell Tower నిర్మాణం చేపడుతుండడంతో Radiation ప్రభావంతో వృద్ధులు, చిన్నారులు, గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపి, చర్మ సంబంధిత, దీర్ఘకాలిక క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని, టవర్ నిర్మాణం చేపట్టవద్దంటూ....