ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని కామారెడ్డి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ విద్య సూచించారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు బాన్సువాడ మండలంలోని హనుమాజీపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రతి ఒక్కరు సమయపాలన పాటించాలని ఆసుపత్రి యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని , రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వైద్యం చేయాలని సూచించారు.