కడప జిల్లా పులివెందులలో విషాద ఘటన జరిగింది. స్థానిక మార్కెట్ యార్డు సమీపంలో ఓ వ్యక్తిపై సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో లింగాల మండలం బోనాలకు చెందిన కృష్ణ యాదవ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతని తలకు తీవ్ర గాయం కావడంతో హుటాహుటిన సమీపంలోని స్థానికులు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.