రైల్వే కోడూరు మండలం మైసూర్ వారి పల్లె వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.. ఆమె వివరాలను రైల్వే కోడూరు ఎస్ఐ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. మృతురాలు వెంకటమ్మ చిట్వేలు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన మహిళ అని తెలిపారు. బైక్ నడుపుతున్న మహేష్, వీరయ్య తీవ్రంగా గాయపడ్డారని ఆయన తెలిపారు. తిరుపతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు.