పులివెందుల పట్టణంలోని ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఏవో తో కలిసి సోమవారం తనిఖీ చేశారు. డీలర్లు రసాయనిక ఎరువులను రైతులకు ఎక్కువ రేటుకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధిక ధరలకు ఎరువులు అమ్మకుండా చూసేందుకు తనిఖీలు చేస్తారు. లైసెన్సులు, బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. అనుమతులు లేకుండా ఎరువులు అమ్మడం, నకిలీ ఎరువులను విక్రయించడం వంటి వాటిని అరికట్టడం జరుగుతుందని చెప్పారు.