పెద్ద కడబూరు: మండల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వగరూరు గ్రామానికి చెందిన హసీనా మృతి చెందినట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి మంగళవారం తెలిపారు. వగరూరుకు చెందిన ఖాదర్ బాషా, తల్లి హసీనాతో బైక్పై ఆదోని నుంచి వస్తుండగా, చిన్నకడబూరుకు చెందిన బోయ కల్లు హనుమయ్య బైక్పై సొంతూరుకు వెళ్తుండగా రెండు బైక్లు ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో హసీనా తీవ్రంగా గాయపడి కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.