యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భువనగిరి పట్టణంలోని రహదారి బంగ్లా పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ సందర్భంగా ఈ నేపథ్యంలో సోమవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రహదారి బంగ్లాను అధికారులతో కలిసి పరిశీలించారు. నూతన భవనం నిర్మించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.