40 లక్షల విలువగల భారీనకిలీ పత్తివిత్తనాలు పట్టుబడిన సంఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అంగడి రైచూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. డి.ఎస్.పి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అంగడి రైచూరు గ్రామంలో విశ్వాసనీయ సమాచారం మేరకు వ్యవసాయ అధికారిణి జి తులసి తన సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించగా 20 క్వింటాళ్ళ నకిలీ పత్తివిత్తనాలు ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పరిగి డిఎస్పి శ్రీనివాస్ వెల్లడించారు.