రాయచోటిలో కుటుంబ కలహాలు రక్తపాతానికి దారితీశాయి. మద్యం మత్తులో ఉన్న కొడుకు సనావుల్లా తన తండ్రి షంషుద్దీన్ పై కత్తితో దాడి చేశాడు. దాడి నుంచి తప్పించుకున్న షంషుద్దీన్, ప్రాణభయం తో కొడుకుపై ప్రతిదాడి చేసి చంపేశాడు. అనంతరం కొడుకు మృతదేహాన్ని ఫ్యాన్ కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే, సనావుల్లా వంటిపై గాయాలు స్పష్టంగా కనిపించడంతో ఇది హత్య కేసుగా పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.