నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలను ఘనంగా శాస్త్రోక్తంగా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్.యుగంధర్ బాబులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో హడావిడిగా ఉండే పోలీసు జీవితంలో వినాయక చవితి సందర్భంగా ఈ విధంగా సిబ్బందితో కలిసి ఆ విగ్నేశ్వరునికి పూజలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని జిల్లా పోలీస్ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొల్పిందని జిల్లా ఎస్పి అన్నారు