ధ్యాన్చంద్ గొప్ప హాకీ క్రీడాకారుడు అని ఆయనను నేటి యువత అందరూ ఆదర్శంగా తీసుకొవాలని వికారాబాద్ జిల్లా యువజన క్రీడల అధికారి ఎంఏ సత్తార్ పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ధ్యాన్చంద్ జన్మదిన పురస్కరించుకొని కలెక్టరేట్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని, నిత్యజీవితంలో కొంత సమయం కేటాయించాలని పేర్కొన్నారు.