గ్రామాలలో నవరాత్రులు వినాయక చవితి సందర్భంగా పూజలు నిర్వహించడం భజనలు భక్తి పారవశంతో చేయడం ద్వారా గ్రామాలలో ఐక్యమత్యం నెలకొంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య పేర్కొన్నారు. శుక్రవారం నవాబుపేట మండల పరిధిలోని ఆయన సొంత గ్రామం చించల్పేట గ్రామంలో పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాలలో ఐక్యమత్యం గా ఉండేందుకు ఇలా గణేష్ మండపాల ఏర్పాటు తో సాధ్యమవుతుందని అన్నారు.