కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని సాయి పరమేశ్వర డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోటరీ క్లబ్ 3160 జమ్మలమడుగు తరుపున ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను రోటరీ సహాయ గవర్నర్ మురళిధర రెడ్డి సమక్షంలో ఘనంగా నిర్వహించినట్లు ముద్దనూరు మండల వ్యవసాయ అధికారి మరియు రోటరీ క్లబ్ అధ్యక్షుడు వెంకట క్రిష్ణారెడ్డి మరియు సెక్రటరీ సంజీవ రాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం సంధర్భంగా జమ్మలమడుగు ప్రాంతంలో వివిధ పాఠశాలల్లో పని చేస్తూ ఎంతో మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.