నూజివీడులో మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి పాత్రికేయుల సమావేశం జరిగింది. టీడీపీ మండల అధ్యక్షుడు యనమదల వాసు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పై మాజీ MLA ప్రతాప్ చవాకులు పేలడం సరికాదని అన్నారు. ఆరోగ్యం, రైతుల సంక్షేమం, సాగుజలాలు ఏఅంశంపైనా ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. మూడు సార్లు MLAగా ఉండి ప్రతాప్ చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు.