నంద్యాల జిల్లా ప్యాపిలిలో టమోటా ధరలు రైతులకు ఒకింత నిరాశకు గురిచేస్తున్నాయి. కష్టపడి పండించిన పంటకు ధరలు నామమాత్రంగా ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఫస్ట్ క్వాలిటీ 20 కేజీల బాక్స్ రూ.300, సెకండ్ క్వాలిటీ 20 కేజీల బాక్స్ రూ.120 నుంచి రూ.150 వరకు ధర పలుకుతోందని రైతులు తెలిపారు. రైతుల నుంచి భారీగా టమోటా మార్కెట్ రావడంతో ధర తగ్గిందన్నారు.