ముగిసిన రాధాకృష్ణన్ తిరుమల పర్యటన తిరుమల, తిరుపతి పర్యటన అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి మహారాష్ట్ర గవర్నర్ సీపీ. రాధాకృష్ణన్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఆయనకు మంత్రి పి.నారాయణ, కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ వీడ్కోలు పలికారు. బొకేలు అందజేసి శాలువాతో సత్కరించారు. బీజేపీ నాయకులు, తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఉన్నారు.